పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి.. | Police Officer Stoned to Death in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి..

Oct 16 2016 1:47 PM | Updated on Sep 17 2018 6:26 PM

పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి.. - Sakshi

పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి..

జమ్ము కశ్మీర్లో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి అమానుషంగా చంపారు.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో కత్వా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి అమానుషంగా చంపారు. ఫింటర్ చౌక్ వద్ద శనివారం రాత్రి విధులు నిర్వహించిన హేమంత్ కుమార్తో నిందితులు గొడవ పడ్డారు. ఇద్దరూ రాళ్లు తీసుకుని దాడి చేయడంతో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంమడుగులో పడివున్న హేమంత్ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

నిందితులను నరేశ్ భద్వాల్, మన్వీర్ లలోత్రాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement