
కాంగ్రెస్‌లో తిరిగి చేరిన ఫూలన్‌దేవి భర్త
ఫూలన్‌దేవి భర్త ఉమెద్ సింగ్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
న్యూఢిల్లీ: కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముంగిట ఒకప్పటి బందిపోటు, మాజీ ఎంపీ ఫూలన్‌దేవి భర్త ఉమెద్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు.
ఉమెద్ సింగ్ రాకను స్వాగతిస్తూ... ఉదెన్ చేరిక వల్ల యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూరుతుందని పార్టీ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. ఉదెన్ బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బీఎస్పీలో చేరకముందు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన లోక్ సభకు మూడుసార్లు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో షాజహాన్ పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు.