విమానం నుంచి జారిపడ్డ ఫోన్‌‌: వైరల్‌ వీడియో | phone fall from a plane: video goes viral | Sakshi
Sakshi News home page

విమానం నుంచి జారిపడ్డ ఫోన్‌‌: వైరల్‌ వీడియో

Aug 16 2017 10:22 AM | Updated on Sep 17 2017 5:35 PM

విమానం నుంచి జారిపడ్డ ఫోన్‌‌: వైరల్‌ వీడియో

విమానం నుంచి జారిపడ్డ ఫోన్‌‌: వైరల్‌ వీడియో

వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి కిందపడ్డ మొబైల్‌ఫోన్‌లో రికార్డైన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

నాష్‌విల్లే: చేతిలో నుంచి జారిపడితేనే పగిలిపోయే మొబైల్‌ ఫోన్‌.. వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా కనీసం చిన్న గీత కూడా పడలేదు. పైగా ఆ వీడియో వైరల్‌ అయింది.

అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్‌ హెండర్సన్‌ మొన్న ఆదివారం ఓ చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తుండగా... అతి సమీపం నుంచి వేరొక విమానం దూసుకురావడాన్ని గమనించాడు. వెంటనే తన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌5 మొబైల్‌ ఫోన్‌ తీసి దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు.

అనూహ్యంగా మొబైల్‌ఫోన్‌ చేతి నుంచి జారిపోయింది! వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతూ అది దృశ్యాలను రికార్డు చేయడం, చివరికి ఒక ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్‌ కావడం, ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫోన్‌ను చూసి ఆ ఇంటివాళ్లు ఆశ్చర్యపోవడం.. అంతా సెకన్లలో జరిగిపోయింది.

టెలికాం కంపెనీ సహాయంతో జీపీఎస్‌ ద్వారా హెండర్సన్‌ పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుంచి పడినా ఫోన్‌కు చిన్న గీత కూడా పడకపోవడం విచిత్రం. హెండర్సన్‌ బంధువొకరు.. ఫోన్‌లో రికార్డయిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement