పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది | Petrol price cut; diesel gets costlier | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది

Jul 31 2014 7:33 PM | Updated on Sep 2 2017 11:10 AM

పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది

పెట్రోల్ ధర తగ్గింది, డీజిల్ రేటు పెరిగింది

పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. లీటర్ ధరపై రూ.1.09 తగ్గింది. మూడున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

న్యూఢిల్లీ: పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. లీటర్ ధరపై రూ.1.09 తగ్గింది. మూడున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర తగ్గడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో డీజిల్ ధర లీటర్ కు 56 పైసలు పెంచారు. సవరించిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

సవరించిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.51, డీజిల్ లీటర్ రూ. 58.40 కానున్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూపాయిన్నర తగ్గే అవకాశముంది. డీజిల్ ధర 72 పైసలు పెరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement