మంత్రి ఇంటిపై బాంబు దాడి | Petrol bomb hurled at Jammu & Kashmir Education Minister's house | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటిపై బాంబు దాడి

Aug 2 2016 12:42 PM | Updated on Jul 11 2019 5:07 PM

విద్యాశాఖ మంత్రి ఇంటిపై గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు.

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బాంబు దాడి చేశారు. నగరంలోని పర్రాయ్ పోరాలో ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై పెట్రోల్ బాంబును విసిరారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది దుండగులు మంత్రి నివాసం పెట్రోల్ బాంబు విసిరి పారిపోయారని చెప్పారు.

దాడిలో ఇంటి ప్రధానగేటు ధ్వంసమయినట్లు వివరించారు. దాడి జరిగిన సమయంలో మంత్రి ఇంట్లో లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత ఏడాది పీడీపీ-బీజేపీల సంకీర్ణప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్తర్, ఆయన భార్య గుప్కర్ రోడ్డులోని హై సెక్యూరిటీ ఇంటికి మారారు. రోడ్లు, భవనాల శాఖ కార్యలయంపై కూడా పెట్రోల్ బాంబును విసిరినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement