పాకిస్థాన్ మరోసారి కవ్వింపు కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు దిగింది.
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కవ్వింపు కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు దిగింది. హిరానగర్ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ అవుట్ పోస్టుపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
కరోల్ కృష్ణ బోర్డర్ అవుట్ పోస్టును లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలు, ఆటోమాటిక్ వెపన్స్ తో దాడికి దిగిందని తెలిపారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. దీనికి బీఎస్ఎఫ్ దీటుగా స్పందించింది.