బీజేపీకి అధికారమిస్తే కోటి ఉద్యోగాలు | One crore jobs if BJP comes to power: Narendra Modi | Sakshi
Sakshi News home page

బీజేపీకి అధికారమిస్తే కోటి ఉద్యోగాలు

Nov 22 2013 1:19 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీకి అధికారమిస్తే కోటి ఉద్యోగాలు - Sakshi

బీజేపీకి అధికారమిస్తే కోటి ఉద్యోగాలు

కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు.

ఆగ్రా: కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వాగ్దానం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు యూపీఏ మాటచ్చినా నిలబెట్టుకోలేకపోయిన ఆ హామీని తాము నెరవేరుస్తామని గురువారమిక్కడ జరిగిన ఎన్నికల భారీ సభలో చెప్పారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వాళ్లు ఉన్నారని, వాళ్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని తెలి పారు.

 

అవినీతిమయమైన కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తూ చెదపురుగుల్లా దేశాన్ని తినేస్తోందని మోడీ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అలాంటి చెదపురుగుల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని, దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే బీజేపీకి అధికారమివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో ఎస్‌పీ, బీఎస్‌పీపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌లాగే ఆ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, ఇప్పుడు వారిస్తున్న కలరింగుతో ఆ వన్నెలు బయటపడుతున్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement