
ఒమర్ అబ్దుల్లా రాజీనామా
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి ఒమర్ అబ్దుల్లా బుధవారం రాజీనామా చేశారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి ఒమర్ అబ్దుల్లా బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్ సీ) ఘోరంగా పరాజయం పాలవడంతో ఆయన సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశముంది.
రెండు స్థానాల్లో పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా ఒక స్థానంలో గెలిచి, మరొక స్థానంలో ఓడిపోయారు. బీర్వా స్థానంలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. సోనావార్ స్థానంలో ఓటమి చవిచూశారు.