breaking news
	
		
	
  Jammu Kashmir CM
- 
      
                   
                               
                   
            'పిల్లల్ని ఎందుకు తీసుకెళుతున్నారు?'

 శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో హింసకు పాల్పడుతున్నవారు కశ్మీరీలు కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు సహకరిస్తున్న జమ్మూ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
 
 ఆందోళనలకు దిగినప్పుడు పెద్దవాళ్లు తమ వెంట ఎందుకు పిల్లల్ని తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారు. పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్లపై ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి వారు అల్లరిమూకల మధ్య భావోద్వేగాలు సృష్టించి తర్వాత పారిపోతున్నారని ఆరోపించారు.
 
 కశ్మీర్ ప్రతిపక్ష నాయకుల బృందం ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. ఈ భేటీల వల్ల సమస్య పరిష్కారమైతే మంచిదేనని ముఫ్తీ అన్నారు. - 
      
                   
                               
                   
            ఒమర్ అబ్దుల్లా రాజీనామా

 శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి ఒమర్ అబ్దుల్లా బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్ సీ) ఘోరంగా పరాజయం పాలవడంతో ఆయన సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయన అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశముంది.
 
 రెండు స్థానాల్లో పోటీ చేసిన ఒమర్ అబ్దుల్లా ఒక స్థానంలో గెలిచి, మరొక స్థానంలో ఓడిపోయారు. బీర్వా స్థానంలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. సోనావార్ స్థానంలో ఓటమి చవిచూశారు. 


