ఆశారాం బాపుకు ఆశాభంగం | no urgency to grant bail to godman Asaram bapu | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపుకు ఆశాభంగం

Sep 23 2014 1:03 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఆశారాం బాపుకు ఆశాభంగం - Sakshi

ఆశారాం బాపుకు ఆశాభంగం

లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో ఆశాభంగం ఎదురైంది.

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నవాదాస్పద స్వామిజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో ఆశాభంగం ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన బెయిల్ కు తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. అనారోగ్య కారణాలతో ఆశారాంకు హడావుడిగా బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో ఆయనపై రేప్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జోధ్‌పూర్‌ సమీపంలోని తన ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను గతేడాది సెప్టెంబర్ లో అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement