సమస్యలేమీ లేవు: నరసింహన్ | No suffer: Narasimhan | Sakshi
Sakshi News home page

సమస్యలేమీ లేవు: నరసింహన్

Aug 9 2015 1:40 AM | Updated on Oct 9 2018 6:34 PM

సమస్యలేమీ లేవు: నరసింహన్ - Sakshi

సమస్యలేమీ లేవు: నరసింహన్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమస్యలేమీ లేవని, అంతా ప్రశాంతంగానే ఉందని ఆ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమస్యలేమీ లేవని, అంతా ప్రశాంతంగానే ఉందని ఆ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆ శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను ఆయన శనివారం ఢిల్లీలో కలిశారు. 

పదో షెడ్యూలులో ఉన్న సంస్థల విభజన, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పెద్ద సమస్యలేవీ లేవని, మీడియా పెద్దగా చూపిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల విభజన, ఇతర సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement