వోడాఫోన్ దివాలీ ఆఫర్ | No national roaming charge on incoming calls for Vodafone customers from this Diwali | Sakshi
Sakshi News home page

వోడాఫోన్ దివాలీ ఆఫర్

Oct 21 2016 4:03 PM | Updated on Sep 4 2017 5:54 PM

వోడాఫోన్ దివాలీ ఆఫర్

వోడాఫోన్ దివాలీ ఆఫర్

ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ దీపావళి ఆఫ‌ర్ ప్రకటించింది. ఈ దీపావళినుంచి నేషనల్ రోమింగ్ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.

ముంబై:  ప్రముఖ  ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ దీపావళి  ఆఫ‌ర్  ప్రకటించింది.    ఈ దీపావళినుంచి నేషనల్ రోమింగ్ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.  తమ  యూజర్లకు   దేశవ్యాప్తంగా  ఉచిత ఇన్కమింగ్ కాల్స్  అందించే  ప్లాన్ ను  ప్రకటించింది. రిల‌య‌న్స్ జియో ఎంట్రీ  వార్‌లో భాగంగా   వోడాఫోన్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని  వెల్లడించింది. 

ఈ దీపావళినుంచి  వోడాఫోన్ వినియోగదారులు, దేశంలో ఎక్కడైనా  రోమింగ్ చింతలేకుండా  స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని   వోడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్  సందీప్ కటారియా తెలిపారు. నేషనల్ అవుట్ గోయింగ్ చార్జీలు హోం చార్జీలతో సమానం  ఉన్నప్పటికీ  ఇన్ కమింగ్ చార్జీల భయం వినియోగదారులను  పీడిస్తున్నట్టు తమ కన్జ్యూమర్ రీసెర్చ్ లో తేలిందన్నారు.  అందుకే తమ యూజర్ల  సౌలభ్యంకోసం ఈ నిరణయం తీసుకున్నామన్నారు. రెండు కోట్ల మందికి పైగా ఉన్న  తమ వినియోగ దారులకు దీని వల్ల లబ్ది చేకూరనుందని కటారియా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement