ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్ | No iota of substance in allegation of gas hoarding: Reliance Industries to Supreme Court | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్

Sep 7 2013 3:30 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్ - Sakshi

ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్‌ఐఎల్

భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తోసిపుచ్చింది. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ, సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల (పీఐఎల్) పిటిషన్ నిరాధారమని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్‌పై 51 పేజీల అఫిడవిట్‌ను ఆర్‌ఐఎల్ దాఖలు చేసింది. కేంద్రంతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌కు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అఫిడవిట్ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement