మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు | Netaji family members to meet PM on May 17 | Sakshi
Sakshi News home page

మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు

Apr 20 2015 8:27 PM | Updated on Oct 20 2018 7:32 PM

మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు - Sakshi

మోదీని కలవనున్న నేతాజీ కుటుంబ సభ్యులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు మే 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

కోల్ కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు మే 17న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలు బయటపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.

ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం మోదీని కోరినట్టు నేతాజీ మునిమేనల్లుడు చంద్రకుమార్ బోస్ తెలిపారు. మే 17న మోదీని కలవాలని ప్రధాని కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని చెప్పారు. నేతాని సంబంధించిన రహస్య పత్రాలను వెల్లడిచేయడంతో పాటు పత్యేక దర్యాప్తు బృందం వేయాలని కోరనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement