నేపాల్కు సాయంగా కదిలిన పాక్, చైనా | Nepal earthquake: China, pak sends search and rescue teams | Sakshi
Sakshi News home page

నేపాల్కు సాయంగా కదిలిన పాక్, చైనా

Apr 26 2015 10:58 AM | Updated on Oct 20 2018 6:37 PM

భారీ భూకంపం కారణంగా నష్టపోయిన నేపాల్ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తుండగా..

ఇస్లామాబాద్: భారీ భూకంపం కారణంగా నష్టపోయిన నేపాల్ను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొస్తుండగా ఇందులో ముఖ్యంగా భారత్ ఇప్పటికే తన సహాయక చర్యలు ప్రారంభించగా పొరుగు దేశాలైనా చైనా, పాకిస్థాన్ కూడా తామూ సాయం చేస్తామంటూ తరలాయి. సీ-130 అనే నాలుగు విమానాలలో వైద్య సదుపాయాలు, సహాయక బృందాలను, ఆహారా పదార్థాలను పాకిస్థాన్ పంపించనుంది.

ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో వైద్య సిబ్బందిని, వైద్య పరికరాలను, పడకలను పాకిస్థాన్ పంపిస్తుంది. మరోపక్క, చైనా కూడా తమ దేశం నుంచి 62 మంది చైనా ఇంటర్నేషనల్ అండ్ రెస్క్యూ టీంను పంపించింది. శిథిలాల కింద మృతదేహాలను గుర్తించే స్నిప్పర్ డాగ్స్ను కూడా ఆదివారం మధ్యాహ్నంలోగా పంపించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement