అవును.. ఆయన అమితాబ్‌ను దాటేశారు! | Narendra modi surpasses amitabh bachchan in twitter followers | Sakshi
Sakshi News home page

అవును.. ఆయన అమితాబ్‌ను దాటేశారు!

Aug 13 2016 1:52 PM | Updated on Aug 15 2018 2:30 PM

అవును.. ఆయన అమితాబ్‌ను దాటేశారు! - Sakshi

అవును.. ఆయన అమితాబ్‌ను దాటేశారు!

ఇండియాలో అమితాబ్ బచ్చన్‌ను తలదన్నేవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే ఇన్నాళ్లుగా లేరనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

ఇండియాలో అమితాబ్ బచ్చన్‌ను తలదన్నేవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే ఇన్నాళ్లుగా లేరనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. దేశంలో అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎవరంటే ఇన్నాళ్లూ అమితాబ్ మొదటి స్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనను దాటేసి మొదటి స్థానం దక్కించుకున్నారు.

ట్విట్టర్‌లో నరేంద్రమోదీకి మొత్తం 21, 869,637 మంది ఫాలోవర్లుండగా, అమితాబ్‌కు 21, 852,405 మంది ఫాలోవర్లున్నారు. అంటే, ఇద్దరి మధ్య తేడా 17,232 అన్నమాట. నరేంద్రమోదీ, అమితాబ్ బచ్చన్‌ల తర్వాత మూడో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఉన్నారు. ఆయనకు 20.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇక ఈ ముగ్గురిలో అమితాబ్ బచ్చన్ 1059 మందిని ఫాలో అవుతుండగా, నరేంద్ర మోదీ మాత్రం 1376 మందిని ఫాలో అవుతున్నారు. షారుక్ ఖాన్ కేవలం 81 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement