
మోదీ @ 56
నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పట్నుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ప్రధాని..
ప్రధానిగా విదేశీ పర్యటనల సంఖ్య
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పట్నుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ప్రధాని.. అమెరికాను నాలుగు సార్లు, నేపాల్, రష్యా, అఫ్గానిస్తాన్, చైనా దేశాలను రెండుసార్లు చొప్పున సందర్శించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు. 2014 సెప్టెంబర్‌లో మొదటిసారి అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు.
ఈ సందర్భంగా వాషింగ్టన్‌తో పాటు న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన ప్రధాని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు.
2016లో మూడోసారి అమెరికాకు వెళ్లి వాషింగ్టన్‌లో అణు భద్రతా సదస్సులో పాల్గొన్నారు. అదే ఏడాది జూన్‌లో ఒబా మా ఆహ్వానం మేరకు మళ్లీ యూఎస్ వెళ్లిన మోదీ.. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అంతేగా కుండా రష్యా, చైనా, మంగోలియా, యూఏఈ, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాను ప్రధాని సందర్శించారు.