Union Minister VK Singh
-
మాల్యాను రప్పించడం చాలా కష్టం
- కేంద్ర మంత్రి వీకే సింగ్ భువనేశ్వర్: ఎగవేతదారుడు, కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను ఉద్దేశించి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పారిపోయి బ్రిటన్‌లో ఆశ్రయం పోందుతున్న మాల్యాను భారత్‌కు తీసుకురావడం చాలా కష్టమని సింగ్ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం భువనేశ్వర్(ఒడిశా)కు వచ్చిన వీకే సింగ్ మీడియాతో మాట్లాడారు. సరిగ్గా మాల్యా అప్పగింత కేసు విచారణ ప్రారంభమైన రోజే విదేశాంగ మంత్రి ఇలా మాట్లాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘బ్రిటన్‌తో మనకున్న ఒప్పందాల ప్రకారం మాల్యాను అప్పగించాల్సిందే. కానీ ఆ పని అంత సులువుగా జరిగేదికాదు. అయినాసరే మేం ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి వీకే సింగ్ చెప్పారు. ‘ఎంత గడువులోగా మాల్యాను ఇండియాకు రప్పిస్తారు?’ అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. నేరస్తుల అప్పగింత ప్రక్రియకు గడువు ఉండదని, నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటామని సింగ్ అన్నారు. 800 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ, మధ్యతరహా నగరాల్లోని 800 పోస్ట్ఆఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని మంత్రి వీకే సింగ్ చెప్పారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి 150 పోస్టాఫీసుల్లో సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆధార్ కార్డుల జారీ, సమాచార మార్పులను కూడా పోస్టాఫీసుల్లో చేపడుతున్నామన్నారు. -
తెలంగాణతో కలసి పనిచేస్తాం
- అమెరికా, ఆస్ట్రేలియా వీసాల అంశంపై ఆ దేశాలతో చర్చిస్తున్నాం - ఎన్ఆర్ఐల అంశాలపై జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి వీకే సింగ్ సాక్షి, హైదరాబాద్ : ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైట్లో ప్రభుత్వం ఆమోదించిన ఏజెంట్ల వివరా లు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారి వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చారు. హజ్‌యాత్రకు వెళ్లే వారి నుంచి ప్రైవేటు ఏజెంట్లు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని, వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవాసీయులు, దౌత్య, పాస్‌పోర్టు సమస్యలపై విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ఇక్కడ హెచ్ఐసీసీలో నిర్వహించిన తొలి సదస్సులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ మంచి ప్రాంతం కావడం, ఇక్కడి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కె.తారకరామారావు డైనమిక్ కావడంతోనే తొలి సదస్సును తెలంగాణలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే భారతీయుల అవగాహన కోసం ‘సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి’ అనే నినాదంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాస్‌పోర్టుల జారీని సరళతరం చేసేందుకు దేశంలోని 800కి పైగా ఉన్న హెడ్ పోస్టాఫీసులను దశలవారీగా పాస్‌పోర్టు సేవాకేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మన దేశంతో ఒప్పందాలు చేసుకున్న దేశాల్లోని జైళ్లలో ఉన్న ప్రవాసీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న వాళ్లు అక్కడ లభిస్తున్న సౌకర్యాలు బాగుండటంతో జైళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారని, స్వదేశానికి వచ్చేందుకు ఇష్టపడటం లేదని చమత్కరించారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో భారతీయులపై ఇప్పటి వరకు ఎలాంటి వీసా ఆంక్షలు విధించలేదన్నారు. సౌదీ కాన్సులేట్ ఏర్పాటుకు సహకరించండి మన దేశంలో సౌదీ అరేబియా తమ రెండో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, అందుకు హైదరాబాద్ సరైనదని సిఫారసు చేయాలని కేటీఆర్ కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో కొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ ఏర్పాటుకు స్థల కేటాయింపులకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓయూ కుదుర్చుకు న్నాయి. కార్యక్రమంలో మంత్రి నాయిని, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ @ 56
-
మోదీ @ 56
ప్రధానిగా విదేశీ పర్యటనల సంఖ్య న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పట్నుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ప్రధాని.. అమెరికాను నాలుగు సార్లు, నేపాల్, రష్యా, అఫ్గానిస్తాన్, చైనా దేశాలను రెండుసార్లు చొప్పున సందర్శించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు. 2014 సెప్టెంబర్‌లో మొదటిసారి అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌తో పాటు న్యూయార్క్‌లో జరిగిన ఐక్య రాజ్య సమితి సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన ప్రధాని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు. 2016లో మూడోసారి అమెరికాకు వెళ్లి వాషింగ్టన్లో అణు భద్రతా సదస్సులో పాల్గొన్నారు. అదే ఏడాది జూన్‌లో ఒబా మా ఆహ్వానం మేరకు మళ్లీ యూఎస్ వెళ్లిన మోదీ.. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అంతేగా కుండా రష్యా, చైనా, మంగోలియా, యూఏఈ, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాను ప్రధాని సందర్శించారు. -
యూకేలో తగ్గుతున్న భారత్ విద్యార్థులు
ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి వి.కె.సింగ్ సమాధానం సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడేళ్లుగా యూకే యూనివర్సిటీల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కేంద్రమంత్రి వి.కె.సింగ్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం లోక్‌సభలో మూడేళ్లుగా లండన్‌లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న మాట వాస్తవమేనా? బ్రిటన్‌లో చదివే వారి వీసా రూల్స్ కఠినతరం చేసింది నిజమేనా? అని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానమిస్తూ బ్రిటన్‌లో విద్యాభ్యాసం తర్వాత అక్కడ పని చేసే అవకాశం లేకుండా వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో అక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారన్నారు. ఈ విషయంపై బ్రిటన్‌తో సంప్రదింపులు జరిపామని, ఆ ప్రభుత్వంతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే ఖండించిందని పేర్కొన్నారు. అయితే, భారతీయ విద్యార్థులపై ఎలాంటి నిబంధనలూ విధించలేదని తెలిపినట్లు చెప్పారు. -
జీఎస్టీపై తేలుస్తారా?
ఈ వారమే రాజ్యసభలో వస్తుసేవల పన్ను బిల్లు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఈ వారమే రాజ్యసభ ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి దీన్ని అమలు చేయాలనుకుంటున్న కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి ఆమోదముద్ర పడేలా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగంపై జరిగిన చర్చ తప్ప మిగిలిన అన్ని రోజులూ కేంద్ర మంత్రి వీకే సింగ్ రాజీనామా డిమాండ్‌తో రాజ్యసభలో విపక్షాల ఆందోళనలతో సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటే పెద్దలసభలో జీఎస్టీ బిల్లును గట్టెక్కించటం బీజేపీకి చాలా కీలకం. అయితే కాంగ్రెస్ మాత్రం తాము సూచించినట్లుగా 18శాతం క్యాప్ విధించటంతోపాటు మరో రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలకు లాభం చేకూర్చేందుకు ఆదనంగా ఒకశాతం లెవీ విధించటాన్ని కేంద్రం రద్దుచేయటంపైనా కాంగ్రెస్ మండిపడుతోంది. సాధారణ మెజారిటీతో ఈ బిల్లులో మార్పులకు అనుమతించకూడదని డిమాండ్ చేస్తోంది. అయితే.. బీజేడీ, ఎన్సీపీ, జేడీయూ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు (32 పార్టీల్లో 30 పార్టీలు) ఏకగ్రీవంగా జీఎస్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. సమస్య పరిష్కారానికి ప్రధాని చొరవతీసుకుని సోనియా, మన్మోహన్‌తో సమావేశమైనా ప్రధాన ప్రతిపక్షం తీరులో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. అవినీతి దర్యాప్తులన్నీ లోక్‌పాల్ కిందకు! అవినీతి ఆరోపణలతో ప్రభుత్వాధికారులపై నమోదయ్యే కేసులను సీబీఐ, చీఫ్విజిలెన్స్కమిషన్, పోలీసులు ఇలా వేర్వేరు సంస్థలు చేస్తున్న దర్యాప్తులన్నింటినీ లోక్‌పాల్ కిందకు తేవాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసే అవకాశముంది. ఈ చట్టంపై కమిటీ రూపొందించిన నివేదికను సోమవారం లోక్‌సభ, రాజ్యసభలలో ప్రవేశపెడతామని కమిటీ ఛైర్మన్ సుదర్శన తెలిపారు. -
లోక్‌సభలో చర్చ.. రాజ్యసభలో రచ్చ
వీకే సింగ్, భాగవత్ వ్యాఖ్యలపై బీఎస్పీ, ఎస్పీ ఆందోళన న్యూఢిల్లీ: పార్లమెంటులో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజ్యసభ వరుసగా రెండోరోజూ విపక్షాల నిరసనలతో అట్టుడికింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ల వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగటంతో.. సభా కార్యక్రమాలు ముందుకు కదల్లేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏఎం రామస్వామి మృతికి సంతాపం తెలిపిన వెంటనే విపక్షాల ఆందోళన మొదలైంది. హరియాణాలో దళిత చిన్నారుల హత్య తర్వాత.. ‘కుక్కపై రాళ్లేసినా ప్రభుత్వానిదే బాధ్యతా?’ అంటూ ప్రశ్నించిన వీకే సింగ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్, బీఎస్పీ సభను స్తంభింపజేశాయి. వీకే సింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. మాయావతి నోటీసు ఇచ్చాకే మాట్లాడాలంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ జోక్యం సూచించటంతో.. ఆగ్రహించిన బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఈ వ్యాఖ్యలపై వీకే సింగ్ వివరణ ఇచ్చినందున తదుపరి చర్యలేమీ ఉండవని స్పష్టం చేసింది. విపక్షాల డిమాండును సింగ్ తోసి పుచ్చారు. పిల్లి, ఎలుక ఆటలు మాని దేశాభివృద్ధిపై చర్చించేందుకు విపక్షాలు సహకరించాలన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. అటు, ‘రామమందిర నిర్మాణానికి రంగం సిద్ధం చేయాలి’ అంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ నిరసన తెలియజేసింది. భాగవత్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎంపీ నరేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. రామమందిర నిర్మాణం విషయంలో ప్రభుత్వంకోర్టు తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్తుందని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పష్టం చేశారు. అటు లోక్‌సభ జీరో అవర్‌లో రైతుల సమస్యలపై చర్చ జరిగింది. రైతన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని.. బీజేపీ ఎంపీ నానా పటోల్ కోరారు. కొలీజియం వ్యవస్థపైనా చర్చ జరిగింది. న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంగా ఉండాలని సభ్యులందరూ ముక్తకంఠంతో కోరారు. కొలీజియం వ్యవస్థ పూర్తిగా విఫలమైందని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. దీనికి కొందరు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా గళం కలిపారు. మరోవైపు, సేవల నుంచి ముందస్తు పదవీ విరమణ తీసుకున్న జవాన్లకు కూడా ఓఆర్ఓపీని అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ దీపెందర్ హూడా డిమాండ్ చేశారు. రెండుసార్లు వెల్‌లోకి చొచ్చుకు వచ్చి గొడవ చేసిన హూడా.. తనకు స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదంటూ.. సభనుంచి వాకౌట్ చేశారు. అటు కేరళలోని ముళ్ల పెరియార్ డ్యామ్ భద్రత విషయంలో కేరళ, తమిళనాడు ఎంపీలు గొడవపడ్డారు. ఇబ్బందిని ‘తప్పించుకున్న’ కేంద్రం ఎస్సీ కేటగిరీలోకి మల్ల, గొరియా, కాశ్యప వంటి మరికొన్ని కులాలను చేర్చాలంటూ.. సమాజ్‌వాద్ పార్టీ ఎంసీ విశ్వంభర ప్రసాద్ ‘ప్రైవేటు సభ్యుడి బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సాధారణంగా ప్రైవేటు సభ్యుడి బిల్లును.. ప్రభుత్వం సమాధానం చెప్పిన తర్వాత వెనక్కు తీసుకుంటారు. కానీ ప్రసాద్ వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్పటంతో రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ ఓటింగ్‌కు అనుమతించారు. ఇబ్బందికర పరిస్థితిని ముందే ఊహించిన బీజేపీ సభ్యులు, ఓ మంత్రి సభనుంచి వెళిపోయారు. ఈ సమయంలో సభలో కేవలం 21 మందే ఉన్నారు. దీంతో ఓటింగ్‌కు అవసరమైన కోరం (రాజ్యసభలో కనీసం 25 మంది సభ్యులుండాలి) లేకపోవటంతో బిల్లు వాయిదా పడింది. పార్లమెంటు సమాచారం పార్లమెంటులో శుక్రవారం ప్రభుత్వం తెలిపిన వివరాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 8 రాష్ట్రాల్లో కరువు ఉన్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తెలిపాయి. వీటిలో ఏడు రాష్ట్రాలు కలిపి జాతీయ విపత్తు సహాయనిధి కింది రూ. 24 వేల కోట్లకు పైగా సాయం అడిగాయి. తెలంగాణ రూ. 1,546 కోట్లు అడిగింది. చిన్న వ్యాపారాల అభివృద్ధికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 42వేల కోట్ల ప్రభుత్వం పంపిణీ చేసింది. 2014-15లో జరిగిన రైలు ప్రమాదాల్లో 292 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో పన్నుచెల్లింపు పరిధిలోకి కొత్తగా కోటి మందిని తేవడం. -
‘అసహనం’ డబ్బు సృష్టి!
కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆరోపణ లాస్ ఏంజెలిస్: భారత్‌లో అసహనంపై జరుగుతున్న చర్చ.. భారీగా డబ్బులు అందుకుంటున్న కొందరి కల్పన అని కేంద్ర మంత్రి వీకే సింగ్ ఆరోపించారు. ‘అసలు ఇది చర్చే కాదు. బిహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రేరేపితంగా వచ్చింది. ఎన్నికలు ముగిశాక అంతా ముగిసిపోయింది’ అని అన్నారు. లాస్ ఏంజెలిస్‌లో ప్రాంతీయ ప్రవాసీ భారతీయ దివస్‌లో ఆయన మాట్లాడారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ చర్చిలో జరిగిన దొంగతనాన్ని చర్చిపై దాడిగా చిత్రీకరించారు. ఓట్ల కోసం ఇలా చేశారు. మీడియా వంత పాడుతోంది. అందుకు డబ్బులిస్తున్నారో లేదో నాకు తెలియదు’ అన్నారు. అన్ని దేశాల నిఘా భాగస్వామ్యంతోనే ఉగ్రదాడులకు అడ్డుకట్ట వేయగలమన్నారు. కాగా జాతీయవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మాఫియా, తదితరులు సైద్ధాంతిక అహసనాన్ని సృష్టిస్తున్నారని బాబా రాందేవ్ ఢిల్లీలో అన్నారు. -
కుక్కపై రాయేసినా..!?
ప్రభుత్వానిదే బాధ్యత అంటారు దళిత పిల్లల సజీవ దహనంపై కేంద్రమంత్రి వి.కె.సింగ్ దళితులంటే మోదీ సర్కారుకు చిన్నచూపు: విపక్షాలు ♦ సింగ్‌ను తప్పించాలి.. ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్లు ♦ ఎఫ్ఐఆర్ నమోదుకు ఎస్సీ కమిషన్ ఆదేశం.. కేసు పెట్టిన ఆప్ హరియాణాలో ఇద్దరు దళిత బాలల సజీవ దహనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనకు కేంద్రానిది బాధ్యత అనొద్దంటూ.. ‘కుక్కపై రాయేసినా కేంద్రానిదే బాధ్యతంటారు’ అంటూ కేంద్రమంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె.సింగ్ వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరతీశారు. దళితులు, ముస్లింలు, పేదలు, అణగారిన వర్గాల వారంటే మోదీ సర్కారుకు గల ఈసడింపునకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర విపక్షాలు. ఇదిలావుండగానే హరియాణాలోనే పోలీస్ కస్టడీలో ఒక దళిత బాలుడు చనిపోవటం, గ్రామంలో అగ్రవర్ణాల వారు కిరోసిన్ పోసి నిప్పటించగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన మరో దళిత యువకుడు మరణించటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ వేర్వేరు ఘటనలని.. వీటికి కులం రంగు పులమొద్దని హరియాణా సీఎం ఖట్టర్ మీడియాపై మండిపడ్డారు. ఘజియాబాద్/న్యూఢిల్లీ: హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇద్దరు దళిత చిన్నారులను అగ్రకుల రాజ్పుట్లు సజీవంగా దహనం చేసిన ఉదంతాన్ని కుక్కను రాళ్లతో కొట్టటంతో పోలుస్తూ కేంద్రమంత్రి వి.కె. సింగ్ దారుణ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన సొంత లోక్‌సభ నియోజకవర్గమైన ఘజియాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక సంఘటనలను ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టకండి. ఆ ఘటనపై విచారణ జరుగుతోంది. ఆ తర్వాత అది కేంద్రం వద్దకు వస్తుంది. ప్రతి దానికీ.. ఎవరైనా ఒక కుక్కను రాయితో కొడితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు ఉంది’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెను రాజకీయ దుమారం చెలరేగింది. ఆయనను విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని.. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో సింగ్ ఆ తర్వాత ఒక ప్రకటన చేస్తూ.. దళిత చిన్నారుల హత్య పిరికిపంద చర్య అని.. అది ప్రస్తుత సమాజపు పరిస్థితికి దిగ్భ్రాంతికరంగా అద్దంపడుతోందని అన్నారు. మానసిక రోగులు చేసిన ప్రతి పనికీ ప్రభుత్వాన్ని నిందించరాదంటూ.. తన వ్యాఖ్యలను వక్రీకరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. మూర్ఖత్వం.. గర్హనీయం: కాంగ్రెస్ దళిత చిన్నారుల దహనాన్ని కుక్కను రాయితో కొట్టటంతో పోల్చటం మూర్ఖత్వం, గర్హనీయమని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు. రెండేళ్ల కిందట ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్ అల్లర్లపై స్పందిస్తూ.. ఒక కుక్కపిల్ల కారు కింద పడి నుజ్జయిపోతే దానికి కూడా సానుభూతి తెలియజేయాలని అనటాన్ని ప్రస్తావించారు. దళితులు, ముస్లింలు, పేదలు, అణగారిన ప్రజలను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రీతిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. తన మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత సెల్జా డిమాండ్ చేశారు. వి.కె.సింగ్‌ను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా ఆప్ ఎమ్మెల్యేలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగ్‌ను జైలుకు పంపాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. పెద్దది చేయొద్దు.. బీజేపీ: వి.కె.సింగ్ వివరణ ఇచ్చినందున.. ఈ విషయాన్ని పెద్దది చేయరాదని అధికార బీజేపీ ఆయనకు మద్దతుగా స్పందించింది. సింగ్‌పై కేసు పెట్టాలన్న ఆప్ పై మండిపడింది. ఢిల్లీలో డెంగీ సోకిన ఓ బాలుడిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో అతడు చనిపోయినప్పుడు, అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆప్ ఏం చేసిందని ప్రశ్నించింది. దళిత బాలల హత్యకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని హరియాణా సీఎం ఎంఎల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన గురువారం సున్పేడ్ గ్రామంలో బాధిత కుటుంబాన్ని సందర్శించారు. మృతుల తండ్రికి రూ. 10 లక్షల చెక్కు అందించారు. వేర్వేరుగా జరిగిన సంఘటనలకు కులం రంగు పులుపుముతున్నారని విమర్శించారు. హద్దులు మీరొద్దు: రాజ్‌నాథ్ వి.కె. సింగ్‌ను, ఉత్తర భారతీయులు నిబంధనల ఉల్లంఘనను గర్వంగా భావిస్తారని అన్న మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా మందలించారు. హద్దులు మీరి ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ‘మంత్రుల వ్యాఖ్యలు వక్రీకరించారంటూ మేం తప్పించుకోవాలనుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు అభిప్రాయాలు వెలిబుచ్చే ముందు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని విలేకర్లతో అన్నారు. మతవిద్వేషాలు అడ్డుకోండి: రాహుల్ ‘దాద్రీ’ ఘటన, ఫరీదాబాద్‌లో దళిత చిన్నారుల సజీవదహనం వంటి సందర్భాల్లో పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నేతలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సూచించారు. దళిత బాలుడి అనుమానాస్పద మృతి సోనిపట్: హరియాణాలో ఓ దళిత బాలుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పావురాన్ని దొంగిలించాడని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లిన మరుసటి రోజే శవమై కనిపించాడు. తమ కొడుకును చిత్రవధకు గురి చేసి పోలీసులే చంపేశారని బాలుడి కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇద్దరు ఏఎస్సైలను సస్పెండ్ చేసి, వారిపై హత్య కేసు నమోదు చేసింది. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు పరిహారమిస్తామని, తెలిపింది. సోనిపట్ జిల్లా దేవీపుర గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలుడు గోవింద్ పావురాన్ని దొంగిలించాడని గడియా లోహర్ కులానికి చెందిన కొందరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవింద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గోవింద్ కుటుంబీకులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. విడిచిపెట్టాలంటే రూ.15 వేలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని గోవింద్ సోదరుడు గౌతమ్ ఆరోపించారు. రాత్రి డబ్బు తీసుకొని వెళ్లగా అప్పటికే విడిచిపెట్టామని, ఎక్కడైనా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు చెప్పాన్నారు. బుధవారం కుటుంబీకులు ఊరిలో వెతగ్గా.. తన ఇంటి దగ్గర్లోని గోవింద్ ఉరేసుకొని కనిపించాడు. ఉరి వల్లే చనిపోయినట్లు, గాయాలేవీ లేవని వైద్యులు చెప్పారు. బాలుడిది ఆత్మహత్యేని సీఎం ఖట్టర్ కూడా అన్నారు. ఆత్మహత్యకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దళిత యువకుడి సజీవ దహనం! చండీగఢ్: హరియాణాలోనే మరో ఘటనలో 21 ఏళ్ల ఓ దళిత యువకుడిని గ్రామ మాజీ పెద్ద కుటుంబం కాల్చి చంపింది. పాత కక్షలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన రజత్ కుటుంబానికి అదే ఊరిలోని రాం స్వరూప్ కుటుంబంతో ఈ నెల 5న గొడవ జరిగింది. కేసు నమోదు కావడంతో రజత్ జైలుకు వెళ్లి 20న బయటకు వచ్చాడు. ఆ కుటుంబాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. మంగళవారం రజత్ కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి, బుధవారం చనిపోయాడు. స్వరూప్ కుటుంబీకులే తన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పటించారని రజత్ తండ్రి కేహర్ ఆరోపించారు. మరోవైపు రజత్ తానే ఒంటికి నిప్పంటించుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో గ్రామ మాజీ పెద్ద రాం స్వరూప్‌పై, అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టామన్నారు. -
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన ‘మీట్ ది స్టేట్స్’ కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వ కార్యక్రమాలను వివిధ దేశాల రాయబారులు, కౌన్సిలర్లకు వివరించామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో లెసైన్సులు మంజూరు చేస్తున్నామన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.