పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం | Telangana investment haven | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

Oct 2 2015 1:46 AM | Updated on Sep 3 2017 10:18 AM

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు...

సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన ‘మీట్ ది స్టేట్స్’ కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ ప్రభుత్వ కార్యక్రమాలను వివిధ దేశాల రాయబారులు, కౌన్సిలర్లకు వివరించామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల ఏర్పాటుకు 15 రోజుల్లో లెసైన్సులు మంజూరు చేస్తున్నామన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement