ఇది మోదీ ప్రభుత్వ విజయం
నాగాలాండ్‌లో అంతర్యుద్ధానికి ముగింపు పలికే దిశగా తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్
	నాగాలాండ్ శాంతి ఒప్పందంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా
	
	న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో అంతర్యుద్ధానికి ముగింపు పలికే దిశగా తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఇసాక్, మ్యువా(ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం)తో ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమని బీజేపీ పేర్కొంది.
	
	ప్రధాని నినాదం ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ను ఇది ప్రతిబింబిస్తోందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని బీజేపీ  అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఒప్పందం విధి, విధానాలు, అమలు ప్రణాళిక కోసం నాగాలాండ్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, నాగాలాండ్‌లో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వివిధ రాజకీయ పార్టీలు స్వాగతించాయి.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
