పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు! | Murder for Pani Puri | Sakshi
Sakshi News home page

పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!

Aug 26 2016 9:21 PM | Updated on Sep 4 2017 11:01 AM

పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!

పానీపూరీల కోసం ప్రాణాలు తీశారు!

పానీపూరీలు ఎవరు ముందు కొనాలనేదానిపై మాటామాటా పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది.

న్యూఢిల్లీ: పానీపూరీలు ఎవరు ముందు కొనాలనేదానిపై మాటామాటా పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసేవరకు వెళ్లింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆగస్టు 4న వాయవ్య ఢిల్లీలోని భలాస్వా డైరీ ప్రాంతంలో జరిగింది.

భలాస్వా ప్రాంతంలోని సింఘానియా గ్లాస్ గోదాము సమీపంలోని కచ్చీ గల్లీలో ఓ వ్యక్తి అపస్మాకర స్థితిలో పడిపోయి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అతణ్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టరు తెలిపారు. చనిపోయిన వ్యక్తి రాజీవ్ నగర్ కు చెందిన ఇర్ఫాన్ గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు అతనిని మోటారుసైకిల్‌పై తీసుకొచ్చి గల్లీలో పడేసి వెళ్లిపోయారని దర్యాప్తులో తేలింది. వాళ్లే ఇర్ఫాన్ ను హత్యచేసి ఉంటారని అనుమానించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య జరిగిన రోజు.. ఇర్ఫాన్, అతణ్ని చంపిన ఇద్దరు వ్యక్తులు ఓ పానీ పూరీ బండి దగ్గర తగువులాడుకున్నారు. పానీ పూరీ ఎవరికి ముందు ఇవ్వాలనే విషయమై జరిగిన గొడవలో బైక్ మీద వచ్చిన ఇద్దరూ ఇర్ఫాన్ ను కొట్టి చంపారు. సమీపంలోని సీసీటీవీల దృశ్యాల ఆధారంగా సునీల్ కుమార్(22), లక్కీ(21) అనే యువకులను పోలీసులు అరెస్టుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement