విడుదలకు ముందే రూ. 60 కోట్ల బిజినెస్‌! | MS Dhoni movie already garnered 60 crores | Sakshi
Sakshi News home page

విడుదలకు ముందే రూ. 60 కోట్ల బిజినెస్‌!

Sep 4 2016 12:25 PM | Updated on Sep 12 2019 8:55 PM

విడుదలకు ముందే రూ. 60 కోట్ల బిజినెస్‌! - Sakshi

విడుదలకు ముందే రూ. 60 కోట్ల బిజినెస్‌!

భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్‌సింగ్‌ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ'.

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్‌సింగ్‌ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్‌ ధోనీ: ద అన్‌టోల్డ్‌ స్టోరీ'. ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తుండగా.. మరోవైపు విడుదలకు ముందే ఈ చిత్రం భారీస్థాయిలో బిజినెస్‌ చేసింది.

'ఎంఎస్‌ ధోనీ' సినిమా కోసం నిర్మాతలు రూ. 80 కోట్లవరకు ఖర్చు చేశారు. కానీ, విడుదలకు ముందే 60 కోట్లు నిర్మాతల జేబుల్లోకి వచ్చిచేరాయి. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డుస్థాయిలో రూ. 60 కోట్లకు అమ్ముడుపోగా, మరో 15 కోట్లు సినిమాకు అనుబంధంగా ఉన్న బ్రాండ్‌ సంస్థల వల్ల లభించాయి.

ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో టికెట్‌ కలెక్టర్‌గా పనిచేసిన ధోనీ సమున్నత క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు? అతని జీవితంలో ఒడిదుడుకులేమిటి? అతని స్ఫూర్తిదాయక ప్రస్థానం గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు తెలియజేస్తూ ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నీరజ్‌ పాండే దర్శకత్వంలో రూపొందిన 'ఎంఎస్‌ ధోనీ' రెండు పాటల ట్రైలర్లు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement