ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయానికి నితీష్ కుమార్ శంకుస్థాపన
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మోడల్ (నమూనా) దేవాలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మోడల్ (నమూనా) దేవాలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు. సుమారు 20 వేల మంది కూర్చునే సామర్ధ్యముతో త్వరలో నిర్మించబోయే ఈ దేవాలయం ఎత్తు 405 అడుగులు ఎత్తు ఉంటుంది అని తెలిపారు. ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సమక్షంలో విరాట్ రామాయణ్ మందిర్ కు శంకుస్థాపన చేశారు.
అత్యంత సంపన్న ట్రస్ట్ గా పేరొందిన మహావీర్ మందిర్ ట్రస్ ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది. 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ దేవాలయాన్ని పాట్నాకు 125 కిలో మీటర్ల దూరంలోని దక్షిణ చంపారన్ జిల్లాలోని కెసారియా సమీపంలోని జంకి నగర్ లో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కాంబోడియాలోని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆంగోకర్ వాట్ టెంపుల్ (215 అడుగులు)కు రెండింతలు పెద్దదిగా ఉంటుందని కునాల్ తెలిపారు. 'ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 దేవాలయాలు ఉంటాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మిస్తాం అని కునాల్ తెలిపారు.