జైలులో దర్జాగా సెల్ఫీ దిగిన మాజీ ఎంపీ! | mla Selfie Inside Siwan Jail Triggers Controversy | Sakshi
Sakshi News home page

జైలులో దర్జాగా సెల్ఫీ దిగిన మాజీ ఎంపీ!

Jan 8 2017 11:56 AM | Updated on Sep 5 2017 12:45 AM

జైలులో దర్జాగా సెల్ఫీ దిగిన మాజీ ఎంపీ!

జైలులో దర్జాగా సెల్ఫీ దిగిన మాజీ ఎంపీ!

జైలులో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షాబుద్దీన్‌ తన సెల్‌లో దర్జాగా సెల్పీ దిగి మరోసారి వివాదాన్ని రేపారు.

సివాన్‌/పట్నా: జైలులో ఉన్న ఆర్జేడీ ఎమ్మెల్యే మహమ్మద్‌ షాబుద్దీన్‌ తన సెల్‌లో దర్జాగా సెల్పీ దిగి మరోసారి వివాదాన్ని రేపారు. ఖైదీ తరహాలో కాకుండా సరికొత్త లుక్‌తో జీన్స్‌ ప్యాంటు, కోటు వేసుకొని ఆయన దిగిన సెల్ఫీలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సివాన్‌ జైలులో ఉన్న ఖైదీకి ఇలాంటి విలాసాలు ఎలా వచ్చాయని ప్రజలు విస్తుపోయారు.

దీంతో సివాన్‌ జిల్లా అధికారులు జైలులో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు మొబైల్‌ ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులు లభించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే షాబుద్దీన్‌ దగ్గర ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అన్నది వారు తెలుపలేదు. ప్రధాన సాక్షిని హత్యకేసులో పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో షాబుద్దీన్‌ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. కరుడుగట్టిన రాజకీయ నేరస్తుడిగా పేరొందిన షాబుద్దీన్‌ దాదాపు 36 కేసులను ఎదుర్కొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement