వెంటాడుతున్న ఫోటోలు!
జింబాబ్వే అందగత్తెలను నగ్న ఫోటోలు వెంటాడుతున్నాయి.
హరారే: జింబాబ్వే అందగత్తెలను నగ్న ఫోటోలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది మిస్ జింబాబ్వే కిరీటం గెల్చుకున్న ఎమిలి కచోటే(25) వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నగ్న ఫోటోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వివాదం రేగింది. నిబంధనల ప్రకారం మిస్ జింబాబ్వే పోటీలో పాల్గొనడానికి ముందు నగ్నంగా ఫోజులు ఇవ్వలేదని పోటీదారులు డిక్లరేషన్ ఇవ్వాల్సివుంటుంది. అలాగే టైటిల్ గెల్చుకున్న తర్వాత ఏడాది వరకు న్యూడ్ ఫోటోలకు నో చెప్పాలి. ఏప్రిల్ 26న ఎమిలి కచోటే మిస్ జింబాబ్వేగా ఎంపికైంది.
అయితే ఆమె న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వివాదం రేగింది. మోసం చేసి ఆమె టైటిల్ గెలిచారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తనతో డేటింగ్ చేసిన వ్యక్తే ఈ ఫోటోలను సోషల్ మీడియా పెట్టి ఉంటాడన్న అనుమానాన్ని ఎమిలి కచోటే వ్యక్తం చేసింది. ఈ ఫోటోలు నిజమైనవని తేలితే మిస్ వరల్డ్ పోటీ నుంచి ఆమె తప్పుకోవాల్సి వస్తుంది.
గతేడాది మిస్ జింబాబ్వే టైటిల్ గెలిచిన సుందరాంగి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఆమె పోటీ నుంచి వైదొలగింది. అయితే అందాల పోటీల్లోనూ ఆడాళ్లకు వేధింపులు తప్పడం లేదంటూ జింబాబ్వే వాసులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.


