మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద | Minor raped by village head | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రామపెద్ద

Jun 17 2014 8:44 PM | Updated on Jul 28 2018 8:35 PM

మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకూ శృతిమించితూనే ఉన్నాయి.

ఫతేపూర్(ఉత్తరప్రదేశ్):  మహిళలు,  మైనర్ బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకూ శృతిమించుతూనే ఉన్నాయి.  ప్రస్తుతం అత్యాచారాల అడ్డాగా మారిపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా  ఓ మైనర్ బాలికపై గ్రామపెద్ద అత్యాచారం చేసిన ఘటన చాంద్ పూర్ పరిధిలో మంగళవారం కలకలం సృష్టించింది. పశువుల్ని తీసుకుని పొలానికి వెళ్లిన పదకొండేళ్ల బాలికపై గ్రామపెద్ద అయిన అరవింద్ సింగ్, అతని సోదరుడుతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. 

 

అనంతరం బాధితురాలి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఆ ఇద్దరి నిందితుల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement