తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
వేలూరు: తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. మినీలారీ లోయలోకి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారీ లోయలోకి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో లారీలో దాదాపు 40 మంది ఉన్నారు. వీరందరూ వేలూరు సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. గాయపడిన వారిని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.