ఉగ్రవాదంపై మాట్లాడరేం? | Matladarem on terror? | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై మాట్లాడరేం?

Oct 4 2015 1:59 AM | Updated on Sep 3 2017 10:23 AM

పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదంపై ఎందుకు నోరు మెదపడం లేదని నోబెల్ శాంతి

పాక్ నాయకులకు మలాలా ప్రశ్న

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదంపై ఎందుకు నోరు మెదపడం లేదని నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ ప్రశ్నించారు.  శనివారం ఆమె ఇండియా టుడే టీవీ చానల్‌తో మాట్లాడుతూ... ‘స్వాత్ లోయలో తీవ్రవాదంపై పాక్ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాలికలకు విద్యను నిరాకరిస్తే వారెందుకు మాట్లాడటం లేదు?’ అని ప్రశ్నించారు.  బెనజీర్ భుట్టోలాగా మీరూ ప్రధాని కావాలనుకుంటున్నారా? అని అడిగినపుడు... ‘జనం కోరుకుంటే, వాళ్లు ఓటేస్తే అవుతాను’ అని బదులిచ్చారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement