breaking news
Nobel Peace
-
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత
-
రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం
ఆ నేడు 9 నవంబర్, 1944 యుద్ధంలో గాయపడిన సైనికులకు, జబ్బుపడ్డ రోగులకు, ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్ర యులైన వారికి చేస్తున్న సేవలకు గాను ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. రెడ్‌క్రాస్‌కు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. అంతకుముందు అంటే 1917లో ఒకసారి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా గాయపడిన సైనికులను చికిత్సా శిబిరాలకు తరలించి, మెరుగైన చికిత్స అందించడం, నిరాశ్రీతులకు ఆశ్రయం కల్పించడం వంటి సేవలతో 1944లో మరోసారి, ఆ తర్వాత అంటే 1963లో మరోసారీ రెడ్‌క్రాస్‌కు ఈ విశిష్ట పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డూనట్ సేవాదృక్పథంతో రెడ్‌క్రాస్ సొసైటీని స్థాపించిన సంగతి తెలిసిందే. . స్థాపించిన అతి కొద్దికాలంలోనే కొన్ని మిలియన్ల మంది సభ్యులతో, 189 సొసైటీలతో విస్తరిస్తూ వచ్చింది రెడ్‌క్రాస్. అనేక దేశాలలోని సొసైటీలతో కలుపుకుని ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందింది. -
ఉగ్రవాదంపై మాట్లాడరేం?
పాక్ నాయకులకు మలాలా ప్రశ్న న్యూఢిల్లీ: పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదంపై ఎందుకు నోరు మెదపడం లేదని నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ ప్రశ్నించారు. శనివారం ఆమె ఇండియా టుడే టీవీ చానల్‌తో మాట్లాడుతూ... ‘స్వాత్ లోయలో తీవ్రవాదంపై పాక్ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాలికలకు విద్యను నిరాకరిస్తే వారెందుకు మాట్లాడటం లేదు?’ అని ప్రశ్నించారు. బెనజీర్ భుట్టోలాగా మీరూ ప్రధాని కావాలనుకుంటున్నారా? అని అడిగినపుడు... ‘జనం కోరుకుంటే, వాళ్లు ఓటేస్తే అవుతాను’ అని బదులిచ్చారు.