మారియట్ నుంచి బడ్జెట్ హోటల్స్ | Marriott opens Fairfield brand hotel in Bangalore | Sakshi
Sakshi News home page

మారియట్ నుంచి బడ్జెట్ హోటల్స్

Oct 10 2013 12:21 AM | Updated on Sep 1 2017 11:29 PM

అంతర్జాతీయంగా లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలపై దృష్టిసారించింది.

  • ఆసియాలో తొలి ‘’ హోటల్ బెంగళూరులో ప్రారంభం
  •      రెండేళ్ళలో 12 ఫెయిర్‌ఫీల్డ్ హోటల్స్; మధ్యతరగతే లక్ష్యం
  •      రెండేళ్ళలో 300కి చేరనున్న మారియట్ హోటల్స్
  •      మారియట్ ఇంటర్నేషనల్ సీవోవో డాన్ క్లెరీ
  •  
     బెంగళూరు నుంచి చంద్రశేఖర్ మైలవరపు
     అంతర్జాతీయంగా లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ‘ఫెయిర్‌ఫీల్డ్డ్ మారియట్’ పేరుతో ఆసియాలో తొలి బడ్జెట్ హోటల్‌ను బుధవారం బెంగళూరులో ప్రారంభించింది. దేశంలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇండియాకు ‘ఫెయిర్‌ఫీల్డ్డ్’ను పరిచయం చేస్తున్నట్లు మారియట్ ఇంటర్నేషనల్ సీవోవో డాన్ క్లెరీ తెలిపారు. ఫెయిర్‌ఫీల్డ్‌ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో డాన్ మాట్లాడుతూ దేశీయ అవసరాలకు అనుగుణంగా హోటల్స్‌ను ఏర్పాటు చేసి విజయవంతం కావడానికి స్థానికంగా ఉండే సంహి హోటల్స్ వంటి సంస్థలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రస్తుతం మారియట్ హోటల్ ప్రపంచవ్యాప్తంగా 20 బ్రాండ్‌లతో హోటల్స్‌ను నిర్వహిస్తుండగా.. ఇందులో 8 బ్రాండ్స్‌ను ఆసియాలో పరిచయం చేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో ఆసియాలో ఫెయిర్‌ఫీల్డ్డ్ బ్రాండ్‌పై ప్రధానంగా దృష్టిసారించనున్నామని, వచ్చే రెండేళ్ళలో మరో 12 ఫెయిర్‌ఫీల్డ్డ్ హోటల్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఆసియా ప్రాంతంలో మారియట్‌కు 145 హోటల్స్ ఉన్నాయని, ఈ సంఖ్యను రెండేళ్ళలో 300కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
     
     ఫెయిర్‌ఫీల్డ్ గురించి..
     అంతర్జాతీయ సౌకర్యాలతో తక్కువ ధరలో ఆతిథ్య సేవలను అందించే విధంగా ఫెయిర్‌ఫీల్డ్డ్‌ను రూపొందించినట్లు భాగస్వామ్య సంస్థ సంహి హోటల్స్ ఎండీ, సీఈవో ఆశీష్ జకన్‌వాలా తెలిపారు. ఇందులో భాగంగా బెంగళూరులో తొలి హోటల్‌ను సుమారు రూ.100 కోట్లతో 148 గదులతో నిర్మించినట్లు తెలిపారు. వ్యాపారం, టూరిస్ట్, ఆధ్యాత్మిక ప్రదేశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇప్పటిదాకా దేశంలో 40 ప్రదేశాలను గుర్తించినా తొలుత 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ హోటల్‌లో గది అద్దె రోజుకు సుమారు రూ.6,500గా నిర్ణయించినట్లు ఆశీష్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement