కాంగ్రెస్ 'విందు' రాజకీయాలు | Manmohan Singh invites top BJP leaders for dinner | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ 'విందు' రాజకీయాలు

Feb 10 2014 1:22 PM | Updated on Mar 29 2019 9:18 PM

కాంగ్రెస్ 'విందు' రాజకీయాలు - Sakshi

కాంగ్రెస్ 'విందు' రాజకీయాలు

తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా బిల్లు మద్దతు ఇచ్చేలా బీజేపీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా బిల్లు మద్దతు ఇచ్చేలా బీజేపీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  ఈనెల 13న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కీలక తెలంగాణ బిల్లుకు పూర్తి సహకారం కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బీజేపీ నేతలకు ఈ నెల 12న విందు ఇస్తున్నారు.

ఈ మేరకు బీజేపీ అగ్రనేతలను ప్రధాని స్వయంగా గత రాత్రి ఫోన్ ద్వారా ఆహ్వానించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీని తన నివాసంలో విందుకు రావాలని కోరారు. కాగా షెడ్యూల్ ప్రకారం సోమవారం ఈ విందు ఏర్పాటు చేయాల్సి ఉన్నా... అద్వానీ అందుబాటులోకి లేనందున ఈ కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement