'మణికట్టు కోసుకుని నదిలోకి దూకాడు' | Man slits wrist, jumps to death into Sabarmati | Sakshi
Sakshi News home page

'మణికట్టు కోసుకుని నదిలోకి దూకాడు'

Jan 6 2015 1:29 PM | Updated on Nov 6 2018 7:56 PM

'మణికట్టు కోసుకుని నదిలోకి దూకాడు' - Sakshi

'మణికట్టు కోసుకుని నదిలోకి దూకాడు'

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నదిలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సబర్మతి నదిలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం నెహ్రు బ్రిడ్జి పైనుంచి దూకి అతడు ప్రాణాలు తీసుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది సోమవారం రాత్రి అతడి మృతదేహాన్ని నది నుంచి బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని నవరంగపుర పోలీసులకు అప్పగించారు.

స్కూటర్ మీద వచ్చిన అతడు నదిలోకి దూకడానికి ముందు మణికట్టు కోసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడి వయసు 30 ఏళ్లు ఉండొచ్చన్నారు. అతడి వద్ద వివరాలేమి లభ్యం కాలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement