బెంగళూరు నగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 2008, 2009 సంవత్సరాల్లో పలు దాడులు చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు నగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 2008, 2009 సంవత్సరాల్లో పలు దాడులు చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన సజ్జన్ కుమార్ (33) నగరంలోని పలు చర్చిలపై గతంలో దాడి చేశాడని, అతడికి ఓ సనాతనవాద సంస్థతో సంబంధాలున్నాయని పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాడ్కర్ తెలిపారు.
యెడవనహళ్లి, హుస్కుర్గేట్ ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర్చిలపై సజ్జన్ కుమార్ దాడులు చేసినట్లు ఆరోపణలున్నాయి. క్రిస్టియన్లు ప్రార్థన చేసుకుంటున్న ప్రాంతంలో పార్కింగ్ చేసిన స్కూటర్కు నిప్పు పెట్టినట్లు కూడా అతడిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మతిగిరి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.