ముంబై రేప్ నిందితుల్లో పోలీస్ ఇన్ఫార్మర్! | Main accused in Mumbai gangrape was police informer | Sakshi
Sakshi News home page

ముంబై రేప్ నిందితుల్లో పోలీస్ ఇన్ఫార్మర్!

Aug 28 2013 3:26 AM | Updated on Aug 21 2018 7:39 PM

నగరంలో ఇటీవల ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పట్టుబడ్డ ఐదుగురు నిందితుల్లో ఒకరు పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

 సాక్షి, ముంబై: నగరంలో ఇటీవల ఓ మహిళా ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పట్టుబడ్డ ఐదుగురు నిందితుల్లో ఒకరు పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ కాసిం షేక్ అలియాస్ కాసిం బెంగాలీ పోలీసులకు ఇన్ఫార్మర్‌గా ఉన్నాడని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల్లో స్థానిక అగ్రిపాడ పోలీసుస్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌కు కాసిం ఏకంగా 60 ఫోన్‌కాల్స్ చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అత్యాచారం జరిగిన మర్నాడు కూడా ఆ కానిస్టేబుల్‌తో అతను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలియవచ్చింది. కాగా, ఫొటో జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పి తన కొడుకు బోరున విలపించాడని ఖాసిం తల్లి చాంద్‌బీబీ పేర్కొంది. అలా ఎందుకు చేశావని నిలదీస్తే తల దించుకున్నాడని చెప్పింది. రేప్ జరిగిన శక్తి మిల్స్ స్థలాన్ని గుజరాత్, ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement