ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు మానసిక వేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతు మృతి చెందిన సంఘటన గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆదిబట్ల: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు మానసిక వేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతు మృతి చెందిన సంఘటన గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం..... నగరంలోని చంద్రాయణ్‌గుట్ట ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్, ఉమారాణి(20) లు ఆరు నెలల క్రీతం తమ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ మధ్యే ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల గ్రామంలో అద్దెకు ఉంటూ ప్రవీణ్‌కుమార్ ఎల్‌అండ్‌టీ కంపనీలో సెక్యురిటిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ప్రేమ వివాహం చేసుకున్న ఉమారాణి పట్ల తమ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడకపోవడంతో ఆమే తీవ్ర మనస్థాపం చెందింది. ఈ నెల 10న సాయంత్రం వీధుల్లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి తన వాళ్లెవరు తనతో మాట్లాడటం లేదని అందుకే ఉరి వేసుకుంటున్నానని చెప్పి బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. వెంటనే ప్రవీణ్ తమ చుట్టు ప్రక్కల వారికి ఫోన్ చేసి చెప్పగా స్థానికులు వె ళ్లి చూడగా అప్పటికే ఉమారాణి అపస్మార క స్థితిలోకి వెళ్లింది. వెంటనే నగరంలోని ఉస్మానియా ఆస్పత్రీకి తరలించగా చికిత్స పొందుతు బుధవారం రాత్రి మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.