
– నర్సంపల్లి కిడ్నాప్ కేసు సుఖాంతం
కీసర: నర్సంపల్లి గ్రామంలో కిడ్నాప్‌నకు గురైన నవ వధువు శ్వేతను పోలీసులు సురక్షితంగా ఆమె భర్తకు అప్పగించినట్లు కీసర సీఐ ఆంజనేయులు శుక్రవారం మీడియాకు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న శ్వేతను ఈ నెల 24న ఉదయం ఆమె తల్లిదండ్రులతోపాటు, బంధువులు కలిసి భర్త ప్రవీణ్ ఇంటిపై దాడిచేసి కారులో బలవంతంగా తీసుకెళ్లారు.
ఈ మేకు బుధవారం శ్వేత భర్త, బంధువులు కీసర పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో శ్వేత ఆచూకీ కోసం రెండు టీమ్‌లను ఏర్పాటు చేసి గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో శ్వేతను కీసర పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. అనంతరం విషయాన్ని ఆమె భర్త ప్రవీణ్‌కు తెలిపి అప్పగించారు. కాగా శ్వేతను కిడ్నాప్ చేసిన తండ్రి బాల్‌నర్సింహ, తల్లి మహేశ్వరితోపాటు కుటుంబీకులు మధు, సుగుణ, మమత, మహేష్, బాలులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.