బోనులో చిక్కిన చిరుత | Leopard which mauled two kids caught in Dhar district | Sakshi
Sakshi News home page

బోనులో చిక్కిన చిరుత

May 4 2015 7:35 PM | Updated on Sep 3 2017 1:25 AM

బోనులో చిక్కిన చిరుత

బోనులో చిక్కిన చిరుత

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది.

ఇండోర్: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. తండా ఫారెస్ట్ రేంజ్ లో సాద్లియాగన్ గ్రామంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కిందని ధార్ డివిజినల్ అటవీశాఖ అధికారి గౌరవ్ చౌదురి తెలిపారు.

వరుస దాడులతో హడలెత్తించిన చిరుతపులి పట్టుబడడంతో ధార్ జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల 9, 16 తేదీల్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులపై చిరుత దాడి చేసి గాయపరించింది. బోనులో చిక్కిన చిరుతను కమలా నెహ్రూ జూకు తరలించినట్టు చౌదురి తెలిపారు. ఈ క్రూరమృగం పూర్తి ఆరోగ్యంతో ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement