కుటుంబానికి న్యాయం చేయడంలో లాలూ మహాదిట్ట | Lalu Prasad Yadav preferred family over social justice: Ram Kripal Yadav after joining BJP | Sakshi
Sakshi News home page

కుటుంబానికి న్యాయం చేయడంలో లాలూ మహాదిట్ట

Mar 12 2014 3:09 PM | Updated on Aug 15 2018 2:14 PM

రాం కృపాల్ యాదవ్ - Sakshi

రాం కృపాల్ యాదవ్

కుటుంబానికి న్యాయం చేయడంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మహా దిట్ట అని ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన రాం కృపాల్ యాదవ్ ఆరోపించారు.

కుటుంబానికి న్యాయం చేయడంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మహా దిట్ట అని ఆ పార్టీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన రాం కృపాల్ యాదవ్ ఆరోపించారు. కుమార్తె మీసా భారతికి పాటలీపుత్ర లోక్సభ స్థానాన్ని కేటాయించి మరోసారి రుజువు చేసుకున్నారన్నారు. బుధవారం న్యూఢిల్లీలో రాం కృపాల్ యాదవ్ బీజేపీ చేరారు. అనంతరం  అనంతరం కృపాల్ యాదవ్ మాట్లాడుతూ... దాదాపు మూడు శతాబ్దాలుగా తాను, లాలూ స్నేహం కొనసాగిందన్నారు.

 

అయితే తాను ఆశించిన పాటలీపుత్ర లోక్సభ స్థానాన్ని తన కుమార్తె మీసా భారతికి కేటాయించడం పట్ల తీవ్ర ఆవేదన చెందానన్నారు. పార్టీలో తన పరిస్థితే ఈ విధంగా ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళనగా ఉందన్నారు. అంతకుముందు కృపాల్ యాదవ్ను బీజేపీలోకి ఆ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా కృపాల్ యాదవ్ మాట్లాడుతూ... గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. కృపాల్ యాదవ్ బీజేపీలో చేరడంతో న్యూఢీల్లోని బీజేపీ కేంద్ర కార్యాలయం సందడిగా మరింది. 

 

తన కుమార్తె మీసా భారతికి పాటలీపుత్ర లోక్సభ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు గత వారం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఆ ప్రకటనపై రాం కృపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆర్జేడీని విడుతున్నట్లు ప్రకటించారు. దాంతో గత వారం లాలూ కుమార్తె మీసా భారతి కృపాల్ యాదవ్ను కలిసే చర్చించేందుకు శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లింది. అయితే ఆ సమయంలో కృపాల్ యాదవ్ ఇంట్లో అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం మీసా మీడియాతో మాట్లాడుతూ... తానకు కృపాల్ యాదవ్ మావయ్యతో సమానమన్నారు. మామయ్యకు, మేనకోడలికి మధ్య యుద్దం ఉండదని మీసా ఈ సందర్భంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement