వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ | Kiran Bedi returns security cover | Sakshi
Sakshi News home page

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

Feb 10 2015 9:56 PM | Updated on Sep 2 2017 9:06 PM

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నకిరణ్ బేడీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలిచిన కిరణ్ బేడీ వై-ప్లస్ సెక్యురిటీ వదులుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆమె అంతకుముందు క్షమాపణ చెప్పారు.

బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు వై-ప్లస్ సెక్యురిటీ కల్పించారు. తనకిక వై-ప్లస్ సెక్యురిటీ అవసరం లేదని, రేపటి నుంచి భద్రతాధికారులు రావాల్సిన అవసరం లేదని సెక్యురిటీ సిబ్బందితో కిరణ్ బేడీ అన్నారు. తనకు భద్రత కల్పించిన సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement