15 మంది చిన్నారుల్ని చిదిమేశాడు.. | Killed and Abused 15 Children, delhi child rape accuse Confesses | Sakshi
Sakshi News home page

15 మంది చిన్నారుల్ని చిదిమేశాడు..

Jul 20 2015 3:06 AM | Updated on Jul 30 2018 8:29 PM

15 మంది చిన్నారుల్ని చిదిమేశాడు.. - Sakshi

15 మంది చిన్నారుల్ని చిదిమేశాడు..

చిన్నారులపై లైంగికదాడులు చేయడం, ఆపై చంపేయడం లాంటి కిరాతక పనులు 2009 నుంచి చేస్తున్నట్లు రవీందర్ ఒప్పుకున్నాడు. అలా ఇప్పటివరకు 15 మంది చిన్నారుల్ని బలితీసుకున్నాడు.

న్యూఢిల్లీ: ఓ చిన్నారిపై అఘాయిత్యం జరిపి హత్యచేసిన కేసులో పట్టుబడ్డ నిందితుడు.. పోలీస్ ఇంటరాగేషన్లో వెల్లడించిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. గడిచిన ఆరేళ్ల నుంచి ఒక్క నోయిడాలోనే 15 మంది చిన్నారుల్ని బలితీసుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు 24 ఏళ్ల రవీందర్ కుమార్.

జులై 15న ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో నిషిరాత్రి వేళ బహిర్భూమికోసం బయటికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని అటకాయించి రేప్ చేసి, హత్యచేశాడు. పాప తప్పిపోయిందన్న తల్లిదండ్రుల ఫిర్యాదుపై గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరుసటిరోజు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో పాప శవం కనిపించింది. పక్కనే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కూడా దొరికింది. దాని ఆధారంగా రవీందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్లో అతను చెప్పిన విషయాలు విస్తుకలిగించాయి.

చిన్నారులపై లైంగికదాడులు చేయడం, ఆపై చంపేయడం లాంటి కిరాతక పనులు 2009 నుంచి చేస్తున్నట్లు రవీందర్ ఒప్పుకున్నాడు. అలా ఇప్పటివరకు 15 మంది చిన్నారుల్ని బలితీసుకున్నాడు. వారిలో అమ్మాయిలే కాదు అబ్బాయిలూ ఉండటం గమనార్హం. రవీందర్ది కూడా 2006లో వెలుగులోకి వచ్చిన 'నిఠారీ హత్యలు' ఉదంతంలాంటిదేనని పోలీసులు అంటున్నారు. అన్ని కేసులకు సంబంధించి త్వరలోనే చార్జిషీటు దాఖలుచేసి, నిందితుడికి కఠిన శిక్షలు పడేలా చేస్తామంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement