షాకింగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. వ్యక్తి అరెస్టు! | Kerala man who live-streamed sex on Facebook arrested | Sakshi
Sakshi News home page

శృంగారాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ చేసి..

Sep 16 2017 4:17 PM | Updated on Jul 26 2018 5:23 PM

షాకింగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. వ్యక్తి అరెస్టు! - Sakshi

షాకింగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. వ్యక్తి అరెస్టు!

ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు.

సాక్షి, కొచ్చి: చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. అందులో ఇంటర్నెట్‌ ఉంటే చాలు.. ఏదైనా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లభిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీని దుర్వినియోగపరిచేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా కేరళలో ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం వివరాలివి..

23 ఏళ్ల లినుకు ఇడుక్కీలోని ఓ వస్త్రాల దుకాణంలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వివాహిత అయిన ఆమెకు ఓ చిన్నారి ఉంది. అయితే, భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ ఆరు నెలలుగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన లిను తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను మహిళతో శృంగారాన్ని జరుపుతున్న ఘటనను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారిపోయింది. ఇద్దరు పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. అతను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి ఆమెకు తెలిసి ఉండకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. లైకుల కోసమే తాను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశానని..ఈ విషయం ఆమెకు తెలుసనని లిను ఆరోపిస్తున్నాడు.

అతని ఫోన్‌లో ఇద్దరూ సాన్నిహితంగా గడుపుతున్న వీడియోలు మరికొన్ని దొరికాయని పోలీసులు అంటున్నారు. మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికో, కోపం ప్రదర్శించడానికో అతను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడంతో మహిళ పెట్టిన రేప్‌ కేసు మాత్రం నిలబడదని అంటున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement