ఊహించని అదృష్టం! ఖాతాలో రూ.వేల కోట్లు | One day Billionaire Kerala man Rs 3500 crore bank account | Sakshi
Sakshi News home page

ఊహించని అదృష్టం! ఖాతాలో రూ.వేల కోట్లు

Oct 9 2026 1:31 PM | Updated on Oct 9 2026 2:13 PM

One day Billionaire Kerala man Rs 3500 crore bank account

మనకు ఒక్కరోజు ముఖ్యమంత్రి గురించి తెలుసు. ఓ సినిమాలో హీరోకు ఒక్క రోజు సీఎం పదవి వస్తే సమాజంలో అవినీతిని అరికట్టి, ప్రజలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాడు. కానీ కేరళలో ఓ వ్యక్తిని ఒక్క రోజు కోటీశ్వరుణ్ని చేసిందో బ్యాంకు! అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం..

కేరళలోని ఓ సూపర్ మార్కెట్ యజమాని తన బ్యాంకు ఖాతాను చెక్‌ చేసుకోగా కళ్లు చెదిరే అంకెలు కనిపించాయి. ఏకంగా రూ.3,500 కోట్లకు పైగా బ్యాలెన్స్ చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం అతని వంతయింది. కొచ్చి సమీపంలోని త్రిపునితురలో దర్శన సూపర్ మార్కెట్ చైన్ యజమాని సుమేష్ కుమార్‌కు ఒక ప్రైవేట్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ అకౌంట్లో అక్టోబర్ 9న ఉదయం అసాధారణంగా అధిక బ్యాలెన్స్ ఉండటాన్ని సుమేష్ కుమార్‌ గమనించినట్లు మలయాళ మీడియా నివేదించింది.

ఇది తనకు ఆకస్మికంగా వరించిన అదృష్టం అని భావించకుండా సుమేష్ కుమార్‌ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు. తనకు కనిపించిన అసాధారణ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గురించి తెలియజేశాడు. తన సూపర్ మార్కెట్లో కార్డు స్వైపింగ్ లావాదేవీల ద్వారా రెండుసార్లు తన ఖాతాలో రూ.3.5 కోట్లు జమ అయినట్లు సందేశాలు వచ్చాయని వివరించాడు. మొత్తం రూ .7 కోట్లు చూపిస్తుందనుకుంటే అనూహ్యంగా అతని ఖాతా బ్యాలెన్స్ రూ .3,500 కోట్లకు పైగా చూపించింది.

కాగా సాంకేతిక లోపమే ఈ వ్యత్యాసానికి కారణమని బ్యాంకు పేర్కొంది. బ్యాంకు అధికారులు సాయంత్రానికల్లా సమస్యను పరిష్కరించడంతో ఖాతా బ్యాలెన్స్ తిరిగి సాధారణ స్థాయికి వచ్చింది. అలా చిన్న సాంకేతిక సమస్య కారణంగా సుమేష్ కుమార్‌ రూ.వేల కోట్లకు ఒక్కరోజు అధిపతి అయ్యాడన్న మాట!

ఇదీ చదవండి: బెంజ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. లాంచ్‌కు ముందే డిమాండ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement