తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు | Karnataka CM Siddaramaiah comments on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు

Dec 30 2015 3:50 AM | Updated on Aug 11 2018 7:06 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు - Sakshi

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించారు. హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా?

హోమాలతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందా?

 సాక్షి, బెంగళూరు: ‘రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించారు. హోమాలు చేసినంత మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? ఈ విషయంలో శాస్త్రీయత ఉందా?’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. మంగళవారం విధానసౌధలో ఏర్పాటు చేసిన కవి కువెంపు జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాగాలు చేస్తే వర్షాలు పడతాయా? అదే కనుక నిజమైతే దేశంలో కరువు ఛాయలే కనిపించేవి కాదు.

దేశాన్నే సుభిక్షంగా చేసేవాళ్లం’ అని ఎద్దేవా చేశారు. చదువుకున్న వాళ్లు కూడా కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మడం బాధ కలిగిస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement