బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్ | Justin Bieber needs to manage own life now, says Usher | Sakshi
Sakshi News home page

బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్

Jun 6 2014 6:04 PM | Updated on Sep 2 2017 8:24 AM

బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్

బీబర్ ..నిన్ను నువ్వే సరిదిద్దుకో:ఉషర్

టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ చేసిన స్వీయ తప్పిదాలనుంచి ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ అభిప్రాయపడ్డాడు.

లాస్ ఏంజిల్స్: టీనేజి పాప్ సంచలనం జస్టిస్ బీబర్ చేసిన స్వీయ తప్పిదాలనుంచి ఇకనైనా గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పలు వివాదాల్లో చిక్కుకున్న బీబర్  జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకుని, వాటిని చక్కదిద్దుకునేందుకు యత్నించాలని  సూచించాడు. పదమూడేళ్లకే పాప్ సింగర్ గా కెరీర్ ను ఆరంభించిన బీబర్ సమస్యలకు అతనే కారణమన్నాడు.

 

కనీసం వాటినుంచి బయటకు రావడానికి బీబర్ యత్నించడం లేదన్నాడు. ఇకనైనా వాటిని అధిగమించాలని ఉషర్ హితవు చేశాడు. 'బీబర్ చేసిన స్వీయ తప్పల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.  అతను ఇంకా చిన్నవాడే.  నా నుంచి బీబర్ ఏమైనా సలహాలు అడిగితే తప్పక సహాయం అందిస్తానని' 35 ఏళ్ల ఉషర్ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement