కేరళకు ఉక్కుమహిళ | Irom Sharmila to spend a month in Kerala after humiliating election defeat | Sakshi
Sakshi News home page

కేరళకు ఉక్కుమహిళ

Mar 14 2017 11:59 AM | Updated on Sep 5 2017 6:04 AM

కేరళకు ఉక్కుమహిళ

కేరళకు ఉక్కుమహిళ

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ఉక్కుమహిళ ఇరోం షర్మిల కేరళకు వెళ్లనున్నారు.

ఇంఫాల్: మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ఉక్కుమహిళ ఇరోం షర్మిల కేరళకు వెళ్లనున్నారు. నెల రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే అట్టాప్పాడి ప్రాంతంలో ఆమె సెలవులు గడపనున్నారు. మహాదాత ఉమా ప్రేమన్ నడుపుతున్న శాంతి ఆశ్రమంలో ఆమె ఉంటారు. ప్రశాంత జీవితం గడిపేందుకు కేరళ వెళుతున్న ఆమె శాశ్వతంగా అక్కడే ఉండిపోతారా, తిరిగి వస్తారా అనేది వెల్లడి కాలేదు.

నేడు(మంగళవారం) 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారా, లేదా అనేదిపై స్పష్టత ఇవ్వలేదు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(అఫ్సా) రద్దు కోసం చేపట్టిన 16 ఏళ్ల నిరాహార దీక్షను విరమించి ఎన్నికల బరిలోకి దిగిన ఆమెకు ఘోర పరాభవం ఎదురైంది. థౌబాల్‌ నియోజకవర్గంలో సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీ చేసి ఓడిన ఆమె దయనీయంగా 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement