ట్రంప్ బ్యాన్: ఐటీ ఉద్యోగులకు కొత్త ఆహ్వానం | Indian techies welcome in Canada after Trump ban | Sakshi
Sakshi News home page

ట్రంప్ బ్యాన్: ఐటీ ఉద్యోగులకు కొత్త ఆహ్వానం

Feb 13 2017 8:58 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ బ్యాన్: ఐటీ ఉద్యోగులకు కొత్త ఆహ్వానం - Sakshi

ట్రంప్ బ్యాన్: ఐటీ ఉద్యోగులకు కొత్త ఆహ్వానం

ట్రంప్ కఠినచర్యలకు ఆందోళన చెందకుండా తమ దేశానికి వచ్చి టెక్నాలజీ సేవలందించాల్సిందిగా ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం కెనడా భారత టెక్కీలకు స్వాగతం పలుకుతోంది.

టొరంటో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వీసాల్లో కఠినతరమైన చర్యలతో ఆందోళనలో ఉన్న భారత టెక్కీలకు గుడ్న్యూస్. ట్రంప్ కఠినచర్యలకు ఆందోళన చెందకుండా తమ దేశానికి వచ్చి టెక్నాలజీ సేవలందించాల్సిందిగా  ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం కెనడా స్వాగతం పలుకుతోంది.  అంతేకాక ట్రంప్ నిషేధానంతరం  కెనడాలో టెక్ రిక్రూట్మెంట్, ఇన్వెస్ట్​‍మెంట్లు భారీగా పెరగనున్నట్టు  ఆ దేశం చెబుతోంది. ''భారత్ నుంచి వచ్చే ప్రతిభావంతులకు ఇదే చక్కని అవకాశం. కెనడాలోనే నివసిస్తూ, కెనడాలో ఉద్యోగం చేసుకోవచ్చు'' అని ఫాంటసీ 360 సీఈవో షాఫిన్ డైమండ్ తేజని చెప్పారు. వాంకోవర్కు చెందిన ఈ కంపెనీ వర్చ్యూవల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ, మిక్స్డ్ రియాల్టీల సహాయంతో గేమ్స్ను అభివృద్ధి చేస్తోంది. వాంకోవర్లోకి స్వాగతం పంపుతున్న తాము భారత్, అమెరికాలో ఉన్న భారత టెక్కీస్ల నుంచి వివరాలు సేకరిస్తున్నామని తేజని చెప్పింది. 
 
ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఆదేశాలతో ప్రభావితులైన వారికి వీసాలు అందించాలని తమ దేశ ప్రధానికి కూడా లేఖ రాసినట్టు కెనడియన్ టెక్నాలజీ కమ్యూనిటీ చెబుతోంది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను హైర్ చేసుకుని, వారికి ట్రైనింగ్ ఇప్పించి, గ్లోబల్ కంపెనీలను తమ దేశంలో స్థాపించి, తమ ఆర్థికవ్యవస్థను మరింత అభివృద్ధి చేసేలా చేస్తామని ఆ లేఖలో టెక్ కమ్యునిటీ పేర్కొంది. అక్కడి టాప్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు కూడా భారత టెక్కీలను కెనడాలో నియమించుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. తాజాగా లాంచ్ అకాడమీ కెనడియన్ స్టార్టప్ ఓ వీసా ప్రొగ్రామ్కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రొగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టార్టప్లు తమ ప్రధాన కార్యాలయాలను కెనడాలో నియమించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్లో ఐదుగురు ప్రధాన వ్యక్తులకు, వారి కుటుంబసభ్యులకు ఆరు నెలల్లో కెనడాలో శాశ్వత నివాసానికి ఆమోదం కల్పిస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement