18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు | Indian sets record in Dubai by getting acca membership at young age | Sakshi
Sakshi News home page

18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు

Oct 12 2015 8:13 AM | Updated on Sep 3 2017 10:47 AM

18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు

18 ఏళ్లకే ఎన్నారై కుర్రోడి రికార్డు

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత సంతతికి చెందిన రామ్‌కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్

దుబాయ్: యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారత సంతతికి చెందిన రామ్‌కుమార్ రామన్ 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ (ఏసీసీఏ) సభ్యత్వం సాధించి రికార్డు సృష్టించాడు. ఏసీసీఏ సభ్యత్వం కోసం మామూలుగా మూడేళ్ల పాటు అర్హత గల పని అనుభవం ఉండాలి.

ఈ అర్హత సాధించటానికి అభ్యర్థులు నాలెడ్జ్ మాడ్యూల్, స్కిల్స్ మాడ్యూల్, ప్రొఫెషనల్ మాడ్యూల్ అనే మూడు దశల్లో పరీక్షలు ఉంటాయి. మొత్తం 14 పేపర్లు ఉంటాయి. ఈ 14 పేపర్లను మూడేళ్లలో పూర్తి చేయాలి. 2012 సెప్టెంబర్‌లో ఈ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుని, ఈ ఏడాది జూన్‌లో చివరి పరీక్ష రాసినట్లు రామన్ చెప్పాడు. మార్కుల పరంగా చెప్పాలంటే 10కి 8.6 గ్రేడ్ సాధించినట్లు పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement