రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్ | Indian Army Men Attract all Eyes During Russian Victory Day | Sakshi
Sakshi News home page

రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్

May 10 2015 11:00 AM | Updated on Sep 3 2017 1:48 AM

రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్

రష్యాలో ఇండియన్ ఆర్మీ అదుర్స్

పొరుగు దేశమైనా అక్కడివాళ్లు మాతృదేశ సైన్యంపై కంటే భారత సైన్యంపైనే దృష్టిని నిలిపారు.

మాస్కో: పొరుగు దేశమైనా అక్కడివాళ్లు మాతృదేశ సైన్యంపై కంటే భారత సైన్యంపైనే దృష్టిని నిలిపారు. రష్యా దినోత్సవం సందర్భంగా అక్కడ జరిగే వేడుకలు చూసేందుకు వచ్చినవారందరి కళ్లను భారత సైన్యం ఆకర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి మే 9న రష్యా విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో ప్రతి ఏడాది మే 9న రష్యా విజయ దినోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ నేపథ్యంలోనే మాస్కోలో నిర్వహిస్తున్న పరేడ్లో ఇండియన్ ఆర్మీ కవాతు నిర్వహించింది.

వేల మంది రష్యా సైనికులతోపాటు, పన్నెండు దేశాలకు చెందిన ఆర్మీ విభాగాలు కూడా వేడుకల్లో కవాతు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన 75 మంది భారత ఆర్మీ మూడు రంగుల జెండాను చేతబట్టి క్రమశిక్షణగా చేస్తున్న పరేడ్కు అక్కడ కూర్చున్న వారంతా మంత్రముగ్దులై చప్పట్ల వర్షం కురిపించారు. కవాతు చేసిన వారిలో అంతా ఆరడుగులు వున్నారు. త్రివర్ణ పతాకాన్ని కెప్టెన్ డీపీ సింగ్ చేతపట్టుకోగా పరేడ్ బాధ్యతలు కెప్టెన్ వికాశ్ సింగ్ సువాగ్ చూసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement