35 పదాల్లో అధ్యక్షుడైపోతారు! | Inauguration Oath: 35 words that make a President | Sakshi
Sakshi News home page

35 పదాల్లో అధ్యక్షుడైపోతారు!

Jan 20 2017 6:30 PM | Updated on Aug 25 2018 7:50 PM

35 పదాల్లో అధ్యక్షుడైపోతారు! - Sakshi

35 పదాల్లో అధ్యక్షుడైపోతారు!

ఆ '35 పదాలు' పలకడంతో డోనాల్డ్‌ ట్రంప్‌ 45వ అమెరికా అధ్యక్షుడైపోతారు..

వాషింగ్టన్‌: 'ఒక్క అడుగు.. ఒక్క అడుగు ' డైలాగ్‌ 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్‌ను నాయకుణ్ని చేస్తుంది. అదే రియల్‌ పాలిటిక్స్‌లో మాత్రం ఒక్కటికాదు, ఆ '35 పదాలు' పలికే వ్యక్తి.. అమెరికా అధ్యక్షుడైపోతారు! అవును. మరికొద్ది గంటల్లో అగ్రరాజ్యాధినేతగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్‌ ట్రంప్‌.. రెండు బైబిళ్లపై(ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి చేయబోయే ప్రమాణంలో కేవలం 35 పదాలు మాత్రమే ఉంటాయి.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30కు) వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ బిల్డింగ్‌ మెట్లపై ఈ 35 పదాలను చెప్పడంతో ట్రంప్‌ అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసినట్లుఅవుంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌.. ట్రంప్‌ చేత ప్రమాణం చేయిస్తారు. 2008లో బరాక్‌ ఓబామాతో ప్రమాణం చేయించిది కూడా ఈయనేకావడం విశేషం.

'ఇనాగరేషన్‌'గా అభివర్ణించే ప్రమాణస్వీకారోత్సవం, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన ట్రంప్‌, మైక్‌ పెన్స్‌లు సతీతమేతంగా లింకన్‌ మెమోరియల్‌ను సందర్శించడంతో మొదలైంది. క్యాపిటల్‌ భవనంలో ప్రమాణస్వీకారం, అక్కడి నుంచి ‘అమెరికా ప్రధాన రహదారి’గా పిలిచే పెన్సిల్వేనియా ఎవెన్యూ గుండా దాదాపు 2.4 కిలోమీటర్ల మేర వైట్‌ హౌస్‌ వరకు ఊరేగింపు ఉంటుంది. రాత్రి అధికారిక విందుతో వేడుక ముగుస్తుంది.  (ఆ పదవిలో అతిపెద్ద వయస్కుడు ట్రంపే)

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ చేయబోయే 35 పదాల ప్రమాణం ఇదే..


'ఇనాగరేషన్‌' ఆహ్వానపత్రి

పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ట్రంప్‌, పెన్స్‌ కుటుంబాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement