
బాగున్నావా.. భయ్యా..
సీన్ అర్థమైందిగా.. వీళ్లంతా కెన్యాలోని మసాయి మారా పార్కులో చీతాలను చూడ్డానికి వెళ్లారు.
సీన్ అర్థమైందిగా.. వీళ్లంతా కెన్యాలోని మసాయి మారా పార్కులో చీతాలను చూడ్డానికి వెళ్లారు. కానీ చీతాకేమో వీళ్లను చూడాలనిపించింది. అంతే.. జంప్ చేసి.. పక్క సీటులో సెటిలైపోయింది. ఒక్క క్షణం జీపులోని వారికి గుండె ఆగిపోయినట్లయినా.. తర్వాత వెంటనే అది వెళ్లిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
పార్కులో గతంలో ఎప్పుడూ ఇలాంటి సన్నివేశం చోటుచేసుకోలేదని అక్కడి సిబ్బంది చెప్పారు. ఈ చీతాలు మనుషులతో స్నేహపూర్వకంగా ఉంటాయని.. పర్యాటకుల జీపుల వద్దకు రావడం.. వాటిపైకి ఎక్కి కూర్చోవడం మామూలేనని.. అయితే.. నేరుగా లోపలికే రావడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.